భారతదేశం, మార్చి 17 -- Apollo Arthritis Program : శస్త్ర చికిత్స అవసరం లేకుండానే కీళ్ల నొప్పులు తగ్గించే కార్యక్రమాన్ని అపోలో ఆసుపత్రి యాజమాన్యం ప్రారంభించింది. జూబ్లీహిల్స్ అపోలో ఆసుపత్రిలో మార్చి 17న ఈ కార్యక్రమం అట్టహసంగా జరిగింది. కీళ్ల నొప్పులతో బాధపడుతున్న వారికి ఇది ఒక వరమనే అపోలో వైద్యులు తెలిపారు. బాధితుల ఆరోగ్యాన్ని దృష్టిలో ఉంచుకుని శస్త్రచికిత్స అవసరం లేకుండానే దీనిని రూపొందించామన్నారు. కీళ్ల నొప్పులు, ఆర్థరైటిస్, వాపు సమస్యలు, స్నాయువు గాయాలతో బాధపడుతున్న రోగుల అవసరాల తీర్చేలా డిజైన్ చేశారు. అసౌకర్యం కలగకుండా, శస్త్ర చికిత్స అవసరం లేకుండానే నొప్పులను తగ్గించే విధంగా దీనిని రూపొందించారు.

అపోలో హాస్పిటల్స్ జాయింట్ మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ సంగీత రెడ్డి మాట్లాడుతూ... "జాయింట్ ప్రిజర్వేషన్ ప్రోగ్రామ్ రోగికి సౌకర్యవంతంగా ఉండే చ...