భారతదేశం, మార్చి 15 -- APOBMMS Subsidy Loans : ఏపీ ప్రభుత్వం స్వయం ఉపాధి పథకాలకు, జనరిక్ మెడికల్ షాపులకు సబ్సిడీతో రుణాలు అందిస్తుంది. బీసీ, కాపు, ఈబీసీ, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్యులకు రుణాలు ఇచ్చేందుకు ఏపీఓబీఎంఎంఎస్ https://apobmms.apcfss.in/ వెబ్ సైట్ ఓపెన్ చేసింది. ప్రస్తుతానికి బీసీ, ఈబీసీ, బ్రాహ్మణ, క్షత్రియ, కమ్మ, రెడ్డి, వైశ్యులను నుంచి ఆన్ లైన్ లో దరఖాస్తులు ప్రారంభించింది. అర్హులైన వారు 10-03-2025 నుంచి 22-03-2025 వరకు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.

వ్యవసాయ సంబంధ కార్యక్రమాలు, పరిశ్రమలు, చిన్న తరహా వ్యాపారం, సేవలు, రవాణా విభాగం వంటి సెక్టార్లకు సంబందించిన యూనిట్లకు సబ్సిడీపై రుణాలు మంజూరు చేస్తారు. పైన తెలిపిన విధంగా అర్హతలు కలిగిన వారు https://apobmms.apcfss.in/ ఈ నెల 10-03-2025 నుంచి 22-03-2025 వారి పేర్లను APO...