భారతదేశం, మార్చి 15 -- APEDB Jobs : ఆంధ్రప్రదేశ్‌ ఎకనామిక్ డెవలప్‌మెంట్ బోర్డు (ఏపీఈడీబీ) కాంట్రాక్టు ప్రాతిప‌దిక‌న ఉద్యోగాలు భ‌ర్తీకి ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉద్యోగాల‌కు జీతాలు ల‌క్షల్లో ఉంటాయి. ఐదు విభాగాల్లో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్, జనరల్ మేనేజర్, మేనేజర్ పోస్టులకు పోస్టుల‌కు నియామ‌కాలు చేప‌డ‌తారు. మొత్తం 22 పోస్టులను కాంట్రాక్టు ప్రాతిపదికన భర్తీ చేసేందుకు అనుమతిస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. రాష్ట్ర ప్రభుత్వ ప్రిన్సిప‌ల్ సెక్రట‌రీ ముకేష్ కుమార్ మీనా జీవో నెంబ‌ర్ 526ను విడుద‌ల చేశారు.

మొత్తం 22 పోస్టులను భ‌ర్తీ చేస్తారు. అందులో అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్-5, జనరల్ మేనేజర్-10, మేనేజర్-7 పోస్టులను భ‌ర్తీ చేయ‌నున్నారు.

1. ఇన్వెస్ట్‌మెంట్ ప్రొమోష‌న్ విభాగం : అసోసియేట్ వైస్ ప్రెసిడెంట్‌- 4 (ఎల‌క్ట్రానిక...