ఆంధ్రప్రదేశ్,అమరావతి, మార్చి 6 -- రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లోని 5వ తరగతి, జూనియర్‌ ఇంటర్మీడియట్‌ ప్రవేశాల కోసం దరఖాస్తులను స్వీకరిస్తున్నారు. ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం. ఇవాళ్టితో ఈ గడువు పూర్తి కానుంది. అయితే ఇందుకు సంబంధించిన గడువును అధికారులు పొడిగించారు. అర్హులైన విద్యార్థులు. మార్చి 15, 2025వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చని గురుకుల సొసైటీ కార్యదర్శి ప్రసన్న వెంకటేశ్‌ ప్రకటించారు.

ఈ విద్యా సంస్థల్లో ప్రవేశాలను ఏపీ బీఆర్‌ఏజీ సెట్ - 2025 ద్వారా చేపడతారు. ఈ పాఠశాలల్లో ఇంగ్లీష్‌ మీడియంలో బోధన ఉంటుంది. రాష్ట్రంలోని వివిధ క్యాంపస్‌లలో బాలికలకు 9,750 సీట్లు, బాలురకు 5,270 సీట్లు అందుబాటులో ఉన్నాయి. 2026-2026 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు కల్పిస్తారు. పూర్తి సమాచారం కోసం డాక్టర్ బీఆర్ అ...