Hyderabad, ఫిబ్రవరి 8 -- కొన్ని మొక్కలు చాలా ఇళ్లలో కనిపిస్తాయి. వాటిలో అపరాజిత మొక్క లేదా శంఖం పూల మొక్క కూడా ఒకటి. ఈ నీలం పువ్వు చూడటానికి ఎంతో అందంగా ఉంటాయి. ఈ మొక్కను బాల్కనీ పెంచుకుంటే అవి తీగలాగా పాకుతాయి. ఈ మొక్కను నాటడం వెనుక మతపరమైన కారణాలు కూడా చెబుతారు. ఈ మొక్క వేర్లు, పువ్వులు కూడా చాలా శక్తివంతమైనవి. ఇవి అనేక వ్యాధులను నయం చేయడానికి ఉపయోగిస్తారు. మీరు మీ ఇంట్లో అపరాజిత మొక్కను నాటాలని నిర్ణయించుకున్నట్లయితే, దాని వలన కలిగే ప్రయోజనాలు, నష్టాలు రెండింటినీ తెలుసుకోవాలి.

మీ బాల్కనీ లేదా ఇల్లు అందంగా ఉండాలంటే ఇలాంటి శంఖంపూల మొక్క పెంచాలి. అపరాజిత మొక్క ఆరోగ్యానికి చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది మీ ఆరోగ్యానికి వరమనే చెప్పుకోవాలీి. దీని వేర్లను అనేక ఆయుర్వేద మందులలో ఉపయోగిస్తారు. ఇది కాకుండా, అపరాజిత పూల టీ ఎన్నో ప్రయోజనాలను కలిగిస...