Hyderabad, ఫిబ్రవరి 27 -- మనసుకు సంబంధించిన వ్యాధులను చాలా మంది ఒకేలా భావిస్తారు. ఉదాహరణకు డిప్రెషన్, ఆందోళన. చాలా మంది ఇవి రెండూ ఒకటే అని అనుకుంటారు. కానీ వాస్తవానికి వీటి మధ్య చాలా తేడా ఉంది. మీరు కూడా డిప్రెషన్, ఆందోళనను ఒకే సమస్యగా భావిస్తే తప్పులో కాలేసారని తెలుసుకోండి. ఎందుకంటే ఇవి రెండూ ఎక్కువ మంది ఎదుర్కొంటున్న మానసిన సమస్యలే అయినప్పటికీ రెండూ వేరు వేరు లక్షణాలతో కూడిన మానసిక వ్యాధులట. వీటి నుంచి తప్పించుకోకపోతే చాలా రకాల అనారోగ్య సమస్యలను ఎదుర్కోవాల్సి ఉంటుంది. కొన్ని సార్లు ఇవి వ్యక్తిని చావు అంచుల వరకూ తీసుకెళతాయి.

కాబట్టి రెండింటి మధ్య ఉన్న తేడాను తెలుసుకుంటనే తగిన పరిష్కారాన్ని కనుగొనచ్చు. డిప్రెషన్, ఆందోళనల మధ్య ఉన్న తేడాలేంటో ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ కన్నయ తన సోషల్ మీడియా ద్వారా వివరించారు. ఇది రెండు వేర్వేరు వ్యాధులకు చ...