Hyderabad, ఏప్రిల్ 22 -- Anurag Kashyap: బాలీవుడ్ డైరెక్టర్ అనురాగ్ కశ్యప్ తెలుసు కదా. ఈ మధ్య సౌత్ సినిమాలపై మనసు పారేసుకొని ముంబై వదిలి వచ్చేశాడు. అయితే కొద్ది రోజుల కిందట అనురాగ్ కశ్యప్ బ్రాహ్మణులపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశాడు. దీనిపై దేశంలోని వివిధ ప్రాంతాల్లో నిరసనలు, ఎఫ్ఐఆర్‌లు వెల్లువెత్తడంతో అనురాగ్ ఇప్పుడు క్షమాపణలు చెప్పాడు. తన తప్పును గ్రహించానని, తన హుందాతనాన్ని మరచిపోకూడదని అన్నాడు.

ఓ వ్యక్తి చేసిన నీచమైన కామెంట్స్ చూసి తాను కూడా సహనం కోల్పోయి ఇలాంటి కామెంట్స్ చేసినట్లు అనురాగ్ వివరించాడు. తన ఎక్స్ అకౌంట్లో అతడు ఓ సుదీర్ఘ పోస్ట్ చేశాడు. "ఓ వ్యక్తికి సమాధానం ఇస్తూ కోపంలో నేను నా హద్దులు దాటాను. మొత్తం బ్రాహ్మణ సమాజం గురించి నేను తప్పుగా మాట్లాడాను.

ఆ సామాజిక వర్గానికి చెందిన ఎంతో మంది ఇప్పటికే నా జీవితంలో ఉన్నారు. ఈరోజు వాళ్లం...