భారతదేశం, ఫిబ్రవరి 26 -- Anupama Parameswaran: ఇటీవ‌లే డ్రాగ‌న్ మూవీతో తెలుగు, త‌మిళ ప్రేక్ష‌కుల‌ను ప‌ల‌క‌రించింది అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. యూత్‌ఫుల్ ల‌వ్ ఎంట‌ర్‌టైన‌ర్‌గా తెర‌కెక్కిన ఈ మూవీ ఫ‌స్ట్ వీకెండ్‌లోనే 50 కోట్ల వ‌సూళ్ల‌ను రాబ‌ట్టి బ్లాక్‌బ‌స్ట‌ర్ దిశ‌గా సాగుతోంది. ప్ర‌దీప్ రంగ‌నాథ‌న్ హీరోగా న‌టించిన ఈ మూవీలో కీర్తి అనే యువ‌తిగా గ్లామ‌ర్ రోల్‌లో అనుప‌మ క‌నిపించింది.

కాగా అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్ మూడేళ్ల క్రితం ఫ్రీడ‌మ్ ఎట్ మిడ్‌నైట్ పేరుతో ఓ షార్ట్ ఫిల్మ్ చేసింది. మెసేజ్ ఓరియెంటెడ్ క‌థాంశంతో తెర‌కెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్ తాజాగా ఓటీటీలోకి వ‌చ్చింది. టెంట్‌కోట ఓటీటీలో స్ట్రీమింగ్ అవుతోంది. 29 నిమిషాల ర‌న్‌టైమ్‌తో తెర‌కెక్కిన ఈ షార్ట్ ఫిల్మ్‌కు ఆర్‌జే షాన్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించాడు. ఈ షార్ట్ ఫిల్మ్‌లో అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో పాటు హ‌కీమ్ షాజ...