భారతదేశం, ఏప్రిల్ 14 -- అందంతో పాటు యాక్టింగ్ తోనూ అదరగొట్టే హాట్ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ రిలేషన్ షిప్ లో ఉందనే వార్తలు గుప్పుమంటున్నాయి. యంగ్ హీరో ధ్రువ్ విక్రమ్ ను ఆమె డేటింగ్ చేస్తుందనే రూమర్స్ విపరీతంగా వస్తున్నాయి. అందుకు ఓ బలమైన కారణం ఉంది. ఇక అనుపమ, ధ్రువ్ కలిసి ప్రస్తుతం 'బైసన్' సినిమాలో నటిస్తున్నారు.

స్పాటిఫై మ్యూజిక్ యాప్ లో అనుపమ ముద్దు ఫొటో ఉందనే వార్త వైరల్ గా మారింది. అనుపమ పరమేశ్వరన్ అనే యూజర్ పేరుతో ఉన్న 'బ్లూ మూన్' ప్లే లిస్ట్ కు ఉన్న కవర్ ఫొటో ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫొటోలో అనుపమ, ధ్రువ్ విక్రమ్ ను లిప్ లాక్ చేస్తున్నట్లు కనిపిస్తోంది. కానీ ఈ ఫొటో వాళ్లదే అనే కచ్చితమైన సమాచారం లేదు. దీన్ని హిందూస్థాన్ టైమ్స్ నిర్ధారించలేదు. కానీ సోషల్ మీడియాలో ఈ స్క్రీన్ షాట్ తెగ వైరల్ గా మారింది.

వైరల్ గా మారిన స్క్రీన్ షాట...