ఆంధ్రప్రదేశ్,గుంటూరు, మార్చి 19 -- గుంటూరులోని ఆచార్య నాగార్జున విశ్వవిద్యాలయం (ఏఎన్‌యూ) సెంటర్ ఫర్ డిస్టెన్స్ ఎడ్యుకేషన్ నుంచి దూర విద్య ప్రవేశాలకు నోటిఫికేషన్ జారీ అయింది. 2025 - 26 విద్యా సంవత్సరానికి సెమిస్టర్ విధానంలో వివిధ డిగ్రీ, పీజీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు.

దరఖాస్తుల స్వీకరణ గడువు ఈనెల 31వ తేదీతో ముగియ‌నుంద‌ని చేసినట్లు దూరవిద్య కేంద్రం డైరెక్టర్ ప్రొఫెస‌ర్‌ వంకాయలపాటి వెంకటేశ్వర్లు తెలిపారు. యూనివర్సిటీ గ్రాంట్ కమిషన్ (యూజీసీ), డెబ్ (డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో) అనుమతితో యూజీ, పీజీ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు.

పీజీ ఆర్ట్స్ లో 11 కోర్సులు, యూజీ ఆర్ట్స్ విభాగంలో 9 కోర్సులు, పీజీ కామర్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ 3 కోర్సులు, యూజీ కామర్స్ మేనేజ్మెంట్ ప్రోగ్రామ్స్ 3 కోర్సులు, లైబ్రరీ ప్రోగ్రామ్స్ 2 కో...