Hyderabad, ఫిబ్రవరి 14 -- ఫిబ్రవరి ప్రేమ మాసం. ప్రేమికులు పండుగ చేసుకునే నెల. కానీ ఇదే నెలలో ప్రేమలో మోసపోయిన వారి కోసం, ప్రేమ సంబంధాలు ఇష్టపడని వారి కోసం కూడా ప్రత్యేక దినోత్సవాలు ఉన్నాయి. అదే యాంటీ వాలెంటైన్స్ వీక్. వాలెంటైన్స్ డే ఫిబ్రవరి 14న ముగిసిన వెంటనే యాంటీ వాలెంటైన్స్ డే మొదలైపోతుంది. వారం రోజుల పాలూ దీన్ని నిర్వహించుకుంటారు.

యాంటీ వాలెంటైన్స్ లో మొదటి రోజు స్లాప్ డే - ఫిబ్రవరి 15న, ఫిబ్రవరి 16న కిక్ డే, ఫిబ్రవరి 17న పెర్ఫ్యూమ్ డే, ఫిబ్రవరి 18న ఫ్లర్ట్ డే, ఫిబ్రవరి 19న కన్ఫెషన్ డే, ఫిబ్రవరి 20న మిస్సింగ్ డే, ఫిబ్రవరి 21న బ్రేకప్ డే ఇలా ఏడు రోజులు ఉంటాయి. ప్రతి రోజుకు ఒక ప్రత్యేక ప్రాముఖ్యత ఉంది.

మీరు ప్రేమలో మోసపోయారా? మీకు మాజీ ప్రేయసి లేదా ప్రియుడు ఉన్నారా? వారు మిమ్మల్ని బాధపెట్టిన అన్నింటికీ మీ మాజీకి గుణపాఠం నేర్పాలనుకుంట...