భారతదేశం, ఫిబ్రవరి 15 -- Anti love jihad act: ప్రేమికుల రోజుగా ప్రపంచ ప్రేమికులంతా పండుగ జరుపుకునే ఫిబ్రవరి 14న మహారాష్ట్ర ప్రభుత్వం లవ్ జిహాద్ కు వ్యతిరేకంగా చట్టాన్ని ఏర్పాటు చేయడానికిి ప్రయత్నాలు ప్రారంభించింది. లవ్ జిహాద్, మోసపూరిత లేదా బలవంతపు మతమార్పిడులను నిరోధించడానికి ఒక ముసాయిదా బిల్లును రూపొందించమని బాధ్యత అప్పగిస్తూ రాష్ట్ర పోలీసు చీఫ్ రష్మీ శుక్లా నేతృత్వంలో ఒక కమిటీని ఏర్పాటు చేసింది.

ప్రేమ పేరుతో హిందూ అమ్మాయిలను ఆకర్షించి, వారిని వివాహం చేసుకుని, లేదా వివాహం చేసుకోకుండానే వారితో బలవంతంగా మత మార్పిడి చేయించడాన్ని లవ్ జిహాద్ గా పేర్కొంటున్నారు. లవ్ జిహాద్ (love jihad) అనేది హిందూ జాతీయవాదులు ఉపయోగించే వివాదాస్పద పదం, ముస్లిం పురుషులు దేశాన్ని స్వాధీనం చేసుకోవడానికి హిందూ మహిళలను వివాహం చేసుకోవడానికి, వారిని ఇస్లాంలోకి మార్చ...