Hyderabad, ఫిబ్రవరి 9 -- Heroine Anshu About Prabhas And Sundeep Kishan In Mazaka: మన్మథుడు సినిమాతో తెలుగులో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది అన్షు. ఈ సినిమా బ్లాక్ బస్టర్ హిట్ కావడంతో అన్షుకు ఫుల్ క్రేజ్ వచ్చింది. ఆ తర్వాత ప్రభాస్ రాఘవేంద్ర మూవీలో హీరోయిన్‌గా నటించింది. అనంతరం మళ్లీ ఇప్పుడు దాదాపుగా 23 ఏళ్ల తర్వాత మళ్లీ తెలుగులో మజాకా మూవీతో ఎంట్రీ ఇస్తోంది అన్షు.

సందీప్ కిషన్, రీతు వర్మ హీరో హీరోయిన్స్‌గా నటించిన మజాకా మూవీలో అన్షు కీలక పాత్ర చేస్తోంది. సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా పాల్గొన్న అన్షు విలేకరుల సమావేశంలో సందీప్ కిషన్, ప్రభాస్ గురించి అడగ్గా ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేసింది.

-మజాకా లవ్లీ స్టొరీ. నాకు చాలా నచ్చింది. ప్రసన్న గారు ఈ కథ చెప్పినప్పుడు చాలా ఎంజాయ్ చేశాను. నవ్వుతూనే ఉన్నాను. నా క్యారెక్టర్‌కు చాలా ఇంపార్టెన్స్ ఉంది. చాల...