భారతదేశం, డిసెంబర్ 3 -- Annapurna Jayanthi 2025: ప్రతి ఏటా మార్గశిర మాసంలో (Margasira Masam) వచ్చే పౌర్ణమి నాడు అన్నపూర్ణాదేవిని ఆరాధిస్తాము. పార్వతి దేవి రూపమైనటువంటి అన్నపూర్ణని ఆ రోజు ఆరాధించడం వలన ఎంతో మంచి జరుగుతుంది. ఆ రోజూ అన్నపూర్ణ దేవిని భక్తిశ్రద్ధలతో పూజించినట్లయితే ఆహారానికి లోటు ఉండదు. ఈ ఏడాది అన్నపూర్ణ జయంతి ఎప్పుడు వచ్చింది? అన్నపూర్ణ జయంతి నాడు ఏం చేయాలి? ఏ విధమైన పరిహారాలను పాటిస్తే అన్నపూర్ణ అనుగ్రహంతో సంతోషంగా ఉండొచ్చు వంటి విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.

అన్నపూర్ణ జయంతి డిసెంబర్ 4, గురువారం వచ్చింది. ఈ రోజున కొన్ని పద్ధతులను పాటించడం వలన ఆహారానికి లోటు ఉండదు, అనేక సమస్యలు తొలగిపోతాయి, సంతోషంగా జీవించవచ్చు. ముఖ్యంగా ఈ పవిత్ర దినాన అన్నపూర్ణకి ఇష్టమైన ఆహారాన్ని నైవేద్యంగా పెట్టినట్లయితే ఆహారానికి లోటు లేకుండా ఆనందంగా జీవ...