ఆంధ్రప్రదేశ్,అన్న‌మ‌య్య జిల్లా, ఫిబ్రవరి 6 -- అన్న‌మ‌య్య జిల్లాలో ఎర్ర‌చంద‌నం స్మ‌గ్ల‌ర్ల‌ు పట్టుబడ్డారు. మొత్తం ఆరుగురు అంత‌రాష్ట్ర స్మ‌గ్ల‌ర్ల‌ను పోలీసులు అరెస్టు చేశారు. వారి వ‌ద్ద‌న నుంచి భారీస్థాయిలో దుంగలను స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.4.20 కోట్లుగా ఉంది. ఒక కారు, మోట‌ర్ సైకిల్ ను సీజ్ చేశారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం కొమిటోని చెరువు వద్ద తిరుప‌తికి చెందిన ఆర్ఎస్ఏఎస్టీఎఫ్ బృందం ఆకస్మికంగా త‌నిఖీలు నిర్వ‌హించింది. బుధ‌వారం టాస్క్‌ఫోర్సు సిబ్బందికి వ‌చ్చిన స‌మాచారం మేర‌కు ఈ త‌నిఖీలు ముమ్మ‌రంగా చేప‌ట్టారు.

సానిపాయలో కొమిటోని చెరువు సమీపంలో ఒక కారు, ఒక మోటారు సైకిల్ ఆగి ఉన్నాయి. కారులో కొంత‌మంది వ్య‌క్తులు ఎర్ర‌చంద‌నం దుంగ‌లు లోడు చేస్తున్నారు. అది గమనించిన టాస్క్ ఫోర్సు పోలీసులు వారిని...