భారతదేశం, మార్చి 31 -- Annamayya Accident : అన్నమ‌య్య జిల్లాలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. కొండ‌పై అగ్ని ప్రమాదం జ‌రిగింది. దీంతో మేత కోసం వెళ్లిన 62 జీవాలు కాలి బూడిద‌య్యాయి. మ‌రికొన్నింటికి తీవ్ర గాయాలు అయ్యాయి. ఈ ఘ‌ట‌న‌తో మూగ జీవాల య‌జ‌మాని క‌న్నీరుమున్నీరుగా విల‌పించాడు. దాదాపు ఆరు ల‌క్షల‌కు పైగా న‌ష్టం జ‌రిగిన‌ట్లు అంచ‌నా వేశారు.

అన్నమ‌య్య జిల్లా ముల‌క‌లచెరువు మండ‌లంలోని దేవుళ‌చెరువు పంచాయతీ వ‌సంత‌రాయుని ప‌ల్లె (ప‌ల్లెగ‌డ్డ)లో ఈ ప్రమాదం చోటుచేసుకుంది. బాధితులు, స్థానికులు తెలిపిన వివ‌రాల ప్రకారం వసంత‌రాయునిప‌ల్లెకు చెందిన పూజారి శ్రీ‌రాములు గొర్రెలు మేపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ప్రతి రోజులానే ఆదివారం కూడా 122 గొర్రెల‌ను మేత కోసం గ్రామానికి స‌మీపంలోని సంద్రకొండ‌కు తోలుకెళ్లాడు. కొండ ప్రాంతంలో గొర్రెలు మేస్తుండ‌గా మ‌ధ్యాహ్నం...