Hyderabad, జనవరి 29 -- Anil Ravipudi Remuneration: అనిల్ రావిపూడి.. ఇప్పుడు టాలీవుడ్ లో ఎంతో డిమాండ్ ఉన్న డైరెక్టర్. ఒకటీ రెండూ కాదు కెరీర్లో వరుసగా 8 హిట్స్ కొట్టిన అతడు.. సహజంగానే ఇప్పుడు ఎంతో మంది నిర్మాతలకు మోస్ట్ వాంటెడ్ డైరెక్టర్. దీంతో తన డిమాండ్ కు తగినట్లే అతడు తన రెమ్యునరేషన్ కూడా పెంచేస్తున్నాడు. తాజాగా సంక్రాంతికి వస్తున్నాం బ్లాక్‌బస్టర్ తర్వాత తన నెక్ట్స్ మూవీ కోసం అనిల్ రావిపూడి తన రెమ్యునరేషన్ భారీగా పెంచేసినట్లు వార్తలు వస్తున్నాయి.

సంక్రాంతికి వచ్చి మరోసారి బ్లాక్‌బస్టర్ హిట్ కొట్టాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. సంక్రాంతికి వస్తున్నా మూవీ ఏకంగా రూ.300 కోట్ల గ్రాస్ వైపు అడుగులు వేస్తోంది. దీంతో ఈ డైరెక్టర్ కు టాలీవుడ్ లో క్రమంగా డిమాండ్ పెరుగుతోంది. తన నెక్ట్స్ మూవీకి అతడు ఏకంగా రూ.25 కోట్ల రెమ్యునరేషన్ తీసుకుంటున్నట్లు సమ...