Hyderabad, మార్చి 30 -- Anil Ravipudi About Katha Sudha OTT Release ETV Win: సంక్రాంతికి వస్తున్నాం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్నాడు డైరెక్టర్ అనిల్ రావిపూడి. త్వరలో మెగాస్టార్ చిరంజీవితో మెగా157 సినిమాను రూపొందించనున్నారు. తాజాగా (ఇవాళ మార్చి 30) ఉగాది సందర్భంగా మెగా157 మూవీ లాంచ్ అయింది.

ఇదిలా ఉంటే, మార్చి 29న కథా సుధ ఓటీటీ స్ట్రీమింగ్ లాంచ్ ప్రెస్ మీట్‌ను నిర్వహించారు. ఈటీవీ విన్‌లో ఏప్రిల్ 6న ఓటీటీ రిలీజ్ కానున్న కథా సుధ ప్రెస్ మీట్‌ లాంచ్‌కు హాజరైన డైరెక్టర్ అనిల్ రావిపూడి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు.

బ్లాక్ బస్టర్ డైరెక్టర్ అనిల్ రావిపూడి మాట్లాడుతూ.. "అందరికీ నమస్కారం. ఈటీవీ విన్ యాప్ పెట్టిన కొత్తలో అందులో ఏం కంటెంట్ ఉందా అని చూశా. నా చిన్నప్పటినుంచి చూసిన సినిమాలు మొత్తం ఉన్నాయి. ఇంటర్నేషనల్ లెవెల్‌లో ఓటీటీల హవా కొనస...