Hyderabad, ఏప్రిల్ 20 -- Anil Ravipudi Release Gymkhana Movie Trailer: మలయాళ సినిమాలకు ఉండే క్రేజ్ వేరు. మలయాళం నుంచి వచ్చే క్రైమ్ థ్రిల్లర్స్, మర్డర్ మిస్టరీ, హారర్ జోనర్ సినిమాలతోపాటు లవ్ స్టోరీ చిత్రాలకు కూడా మంచి ఆదరణ లభిస్తుంటుంది. అలా గతేడాది మలయాళం నుంచి వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ కొట్టిన సినిమా ప్రేమలు.

నస్లీన్ కే గఫూర్, మమితా బైజు నటించిన ప్రేమలు మలయాళంతోపాటు తెలుగులో కూడా భారీ బ్లాక్ బస్టర్ హిట్ అందుకుంది. దాంతో తెలుగు రాష్ట్రాల్లో హీరో నస్లీన్‌కు మంచి గుర్తింపు లభించింది. ఇప్పుడు నస్లీన్ నటించిన సరికొత్త సినిమా అలప్ఫుళ జింఖానా. ఈ సినిమాను తెలుగులో జింఖానా టైటిల్‌తో ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.

అలప్పుళ జింఖానా సినిమా ఇప్పటికే మలయాళంలో బాక్సాఫీస్ వద్ద బిగ్ హిట్ అయింది. ఇప్పుడు ఈ స్పోర్ట్స్-ప్యాక్డ్, యూత్‌ఫుల్ ఎంటర్‌టైనర్ ...