భారతదేశం, జనవరి 28 -- Andole Tank Bund : ఆందోల్ పట్టణానికి తలమానికంగా నిలిచిన ఆందోల్ పెద్ద చెరువు ట్యాంక్ బండ్ ను పర్యాటకుల కోసం ఆహ్లాదకరంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందించాలని మంత్రి దామోదర్ రాజనర్సింహ పర్యాటక శాఖ అధికారులను ఆదేశించారు. ఆందోల్ ట్యాంక్ బండ్ లో పర్యాటకుల కోసం బోటింగ్ సౌకర్యం, రెస్టారెంట్, ట్యాంక్ బండ్ బ్యూటిఫికేషన్, వాకింగ్ ట్రాక్ నిర్మాణంపై మంత్రి అధికారులతో చర్చించారు.

ఈ సమీక్షలో పట్టణంలో నిర్మిస్తున్న ఆధునిక లైబ్రరీ, మున్సిపల్ ఆఫీస్ పనుల పురోగతిపైనా చర్చించారు. ఆందోల్ - జోగిపేట మున్సిపాలిటీలో ఉన్న గాంధీ పార్క్ ఆధునీకరణ పనులు చేపట్టాలని మున్సిపల్ కమిషనర్ ను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. అలాగే పట్టణంలో ఉన్న ఎన్టీఆర్ స్టేడియంలో వాలీబాల్, ఫుట్ బాల్, క్రికెట్ గ్రౌండ్ లలో మౌలిక సదుపాయాల కల్పనతో పాటు మల్టీ పర్ప...