భారతదేశం, ఫిబ్రవరి 17 -- డ్వాక్రా సంఘాల్లోని మహిళలను మరింత అండంగా ఉండేందుకు ఏపీ సర్కార్ సిద్ధమవుతోంది. ఇటీవలే కాలంలో పలుమార్లు ముఖ్యమంత్రి చంద్రబాబు కూడా సమీక్షలు నిర్వహించారు. వారికి మరింత లబ్ధి చేకూర్చే అంశాలపై చర్చించారు. వారి పిల్లల విద్యకు ప్రభుత్వ పరంగా తోడ్పాటు కూడా అందిస్తామని స్పష్టం చేశారు. అయితే వారికోసం ప్రత్యేకంగా మరో 2 కొత్త పథకాలను ప్రారంభించేందుకు చంద్రబాబు సర్కార్ సిద్ధమవుతోంది. అయితే వీటిని మహిళా దినోత్సవం(మార్చి 8) సందర్భంగా ప్రారంభించాలని యోచిస్తోంది.

వచ్చే మార్చి 8వ తేదీ నాటికి సెర్ప్ (గ్రామీణ పేదరిక నిర్మూలన సొసైటీ) ఏర్పాటై 25ఏళ్లు పూర్తవుతాయి. ఈ సందర్భంగా పలు వరాలు ప్రకటించేందుకు ప్రభుత్వం సిద్ధమైంది. ఇందులో భాగంగా డ్వాక్రా మహిళల కోసం రెండు పథకాలను అమలు చేయనుంది. ఎన్టీఆర్ విద్యాలక్ష్మీ, ఎన్టీఆర్ కల్యాణ లక్ష్మీ పేర్...