భారతదేశం, ఏప్రిల్ 11 -- ఇంగ్లాండ్ లెెజెండరీ ఫాస్ట్ బౌలర్ జేమ్స్ అండర్సన్ ప్రతిష్ఠాత్మక అవార్డు సొంతం చేసుకున్నాడు. నైట్‌హుడ్‌ పురస్కారాన్ని దక్కించుకున్నాడు. దీంతో అతను సర్ అనే బిరుదు పొందాడు. సర్ అండర్సన్ గా మారాడు. ఈ అవార్డు సొంతం చేసుకున్న 13వ ఇంగ్లాండ్ క్రికెటర్ గా అండర్సన్ నిలిచాడు.

గత ఎన్నికల్లో దారుణ పరాజయంలో రిషి సునాక్ బ్రిటన్ ప్రధాని పదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రిషి సునాక్ రిసిగ్నేషన్ హానర్స్ లిస్ట్ లో అండర్సన్ పేరు కూడా ఉంది. మాజీ పీఎం రిషి జాబితా ప్రకారం అండర్సన్ కు నైట్‌హుడ్‌ పురస్కారం దక్కింది.

నైట్‌హుడ్‌ పురస్కారాన్ని పొందిన ఇంగ్లాండ్ లెెజెండ్ క్రికెటర్ల సరసన అండర్సన్ చేరాడు. ఈ అవార్డు సొంతం చేసుకున్న 13వ ఇంగ్లిష్ ఆటగాడు అతను. ఈ లిస్ట్ లో ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్లు అలిస్టర్ కుక్, ఆండ్రూ స్ట్రాస్ లాంటి వాళ్...