భారతదేశం, జనవరి 27 -- రాప్తాడు రాజకీయాలు మళ్లీ టాక్ ఆఫ్ ది ఏపీగా మారాయి. రైలు పట్టాలపై ఓ యువకుడు శవమై కనిపించడం.. దీనికి కారణం మాజీ ఎమ్మెల్యే సోదరుడని టీడీపీ ఆరోపించడంతో రాజకీయం హీటెక్కింది. మృతుడి తండ్రితో సహా.. టీడీపీ లీడర్ పరిటాల శ్రీరామ్ తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, అతని సోదురుడిపై సంచలన ఆరోపణలు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అనంతపురం జిల్లా రాప్తాడు నియోజకవర్గం తోపుదుర్తి గ్రామంలో టి.మహేశ్వర రెడ్డి అనే యువకుడి కుటుంబం ఉంటోంది. మహేశ్వర రెడ్డి.. శనివారం రాత్రి పాలచెర్లకు చెందిన మురళి అనే యువకుడితో కలిసి.. సోములదొడ్డి గ్రామంలోని బస్టాప్ వద్దకు వెళ్లాడు. తనకు పని ఉందని, పూర్తి చేసుకుని మళ్లీ ఫోన్‌ చేస్తానని తన వెంట వచ్చిన యువకుడికి మహేశ్వర రెడ్డి చెప్పాడు. దీంతో అతడు అక్కడి నుంచి అనంతపురం వెళ్లాడు. కాసేపటి తర్వాత పని పూర్తయిందన...