భారతదేశం, ఫిబ్రవరి 12 -- Anantapur Crime: అనంతపురంలో వివాహేతర సంబంధం నేపథ్యంలో ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తను చంపేసిన ఘటన వెలుగు చూసింది. స‌మాచారం అందుకున్న పోలీసులు ఘ‌ట‌న స్థ‌లానికి చేరుకుని ప‌రిశీలించారు. పోలీసులు హ‌త్య కేసుగా న‌మోదు చేసి, ద‌ర్యాప్తు చేపట్టారు. దీంతో అస‌లు నేర‌స్తురాలు భార్యనే అని తెలుసుకున్నారు. మృతుడి భార్య‌తో పాటు ఆమె ప్రియుడు, మ‌రొక‌రిని పోలీసులు అరెస్టు చేశారు.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం ధ‌ర్మ‌వ‌రం మండ‌లం మ‌ల్కాపురానికి చెందిన దేవ‌ర‌కొండ కాశ‌ప్ప‌, సౌభాగ్య భార్యాభ‌ర్త‌లు. రెండేళ్లుగా క‌క్క‌ల‌ప‌ల్లి టమాటా మండీలో కాశ‌ప్ప కూలీల‌కు మేస్త్రీగా ఉన్నాడు. భ‌ర్త కాశ‌ప్ప రెండు నెల‌ల క్రితం పొలం అమ్మ‌గా వ‌చ్చిన డ‌బ్బు తీసుకుని చీరల వ్యాపారం చేయ‌డానికి హైద‌రాబాద్‌కు వెళ్లాడు.

వ్యాపారం చేస్తూ అక్క‌డే ఉండేవాడు. భార్య...