భారతదేశం, ఫిబ్రవరి 17 -- అనంతపురం జిల్లా బుక్క‌రాయ‌స‌ముద్రంలో సెంట్ర‌ల్ యూనివ‌ర్శిటీ ఉంది. ఇక్కడ ఆదివారం మ‌ధ్యాహ్నం 2.30 గంట‌ల స‌మ‌యంలో.. ఉమెన్స్ హాస్ట‌ల్ బాత్‌రూమ్‌ల్లోకి ఒక‌రు తొంగిచూస్తూ.. వీడియో తీస్తున్న‌ట్లు నీడ క‌న‌బ‌డింద‌ని విద్యార్థినులు చెబున్నారు. అప్ర‌మ‌త్త‌మైన విద్యార్థిని కేక‌లు వేయ‌డంతో అగంత‌కుడు పారిపోయాడు. ఇదే మొద‌టి సారి కాద‌ని, గ‌తంలో కూడా ఇలానే జ‌రిగింద‌ని విద్యార్థినులు చెబుతున్నారు.

గతేడాది డిసెంబ‌ర్ 9వ తేదీన అర్ధ‌రాత్రి కూడా కొంద‌రు యువ‌కులు అమ్మాయిల బాత్‌రూమ్‌ల వైపు తొంగి చూసేందుకు ప్ర‌య‌త్నించార‌ని చెప్పారు. అప్పుడు కూడా విద్యార్థినులు గ‌ట్టిగా కేకలు వేయ‌డంతో ఆ యువ‌కులు పారిపోయారని అంటున్నారు. భ‌యంత వ‌ణికిపోయి డ‌య‌ల్ 100కి ఫోన్ చేసి పోలీసుల‌కు ఫిర్యాదు చేశామ‌ని.. అప్ప‌ట్లో డీఎస్పీ వెంక‌టేశ్వ‌ర్లు యూనివ‌ర్శిటీకి వ...