భారతదేశం, జనవరి 2 -- అనంత‌పురం జిల్లా విడ‌ప‌న‌క‌ల్లు మండ‌లం పాల్తూరు గ్రామానికి చెందిన.. చిన్న‌తిప్ప‌మ్మ (17) బ‌ళ్లా రోడ్డులోని ఓ ప్రైవేటు కళాశాల‌లో ఇంట‌ర్మీడియ‌ట్ సెకెండ్ ఇయ‌ర్ చ‌దువుతోంది. అక్క‌డే హాస్ట‌ల్‌లో ఉంటూ చ‌దువుకుంటుంది. చిన్న‌తిప్ప‌మ్మ‌కు అదే కాలేజీలోని ఫ‌స్ట్ ఇయ‌ర్ విద్యార్థిని ఫ్రెండ్ ఉంది. వీరిద్ద‌రూ బెస్ట్ ఫ్రెండ్స్‌గా ఉన్నారు. ఎక్క‌డికి వెళ్లినా ఇద్ద‌రూ క‌లిసేవెళ్లేవారు.

అయితే మంగ‌ళ‌వారం రాత్రి హాస్ట‌ల్‌లోని స్టూడెంట్స్ అంతా న్యూ ఇయ‌ర్ సెల‌బ్రేష‌న్స్ చేసుకున్నారు. ఆ వేడుక‌ల్లో చిన్న‌తిప్ప‌మ్మకు తన బెస్ట్ ఫ్రెండ్‌ విషెస్ చెప్ప‌లేదు. దీంతో త‌న బెస్ట్ ఫ్రెండే త‌న‌కు విషెస్ చెప్ప‌లేద‌ని మ‌న‌స్తాపానికి గురైంది. బుధ‌వారం హాస్ట‌ల్‌లోని మెస్‌లో ఉరేసుకుని ఆత్మ‌హ‌త్య చేసుకుంది. దీన్ని గుర్తించిన తొటి విద్యార్థులు.. చిన్న‌తిప్ప‌మ్మ...