భారతదేశం, ఏప్రిల్ 1 -- Anant Ambani: రిలయన్స్ ఇండస్ట్రీస్ డైరెక్టర్, ఆసియాలోనే అత్యంత ధనవంతుడు ముకేశ్ అంబానీ కుమారుడు అనంత్ అంబానీ జామ్ నగర్ నుంచి ద్వారకా వరకు 140 కిలోమీటర్ల పాదయాత్రను ప్రారంభించారు. గత సంవత్సరం అనంత్ అంబానీ తన చిన్నప్పటి స్నేహితురాలు రాధికా మర్చంట్ ను వివాహం చేసుకున్న విషయం తెలిసిందే. అయితే, అనూహ్యంగా, గతవారం అనంత్ అంబానీ ఈ పాదయాత్రను ప్రారంభించారు.

అనంత్ అంబానీ శ్రీకృష్ణుడి భక్తుడు. మరోవైపు, ద్వారక కృష్ణుడి అడుగుజాడలు ఉన్న చారిత్రక, ఆధ్యాత్మిక నగరం. అందుకే తన 30వ జన్మదినాన్ని పురస్కరించుకుని అనంత్ అంబానీ పాదయాత్ర చేసి ద్వారకలో ద్వారకాధీషుడైన శ్రీకృష్ణుని దర్శనం చేసుకోవాలని నిర్ణయించుకున్నారు. ఈ 140 కిలోమీటర్ల పాదయాత్రను అనంతర్ అంబానీ 5 రోజుల క్రితమే ప్రారంభించారు. అనంత్ అంబానీ కాలినడకన ద్వారకా చేరుకోవడానికి మరో రెండు ...