భారతదేశం, ఏప్రిల్ 13 -- Anakapalli Fire Accident : అనకాపల్లి జిల్లా కైలాసపట్నం ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్ర అనిత వంగలపూడి, కలెక్టర్, ఎస్పీతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదానికి కారణాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

అనకాపల్లి జిల్లా కోటవురట్ల మండలం కైలాసపట్నంలోని ఒక బాణా సంచా తయారీ కేంద్రంలో ప్రమాద ఘటన పట్ల మాజీ సీఎం , వైసీపీ అధినేత వైఎస్ జగన్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తంచేశారు. ఈ ఘటనలో పలువురు మరణించడం, మరికొందరు తీవ్రంగా గాయపడడం తీవ్ర విచారకరమన్నారు. మరణించినవారి క...