భారతదేశం, ఏప్రిల్ 13 -- Anakapalli Fire Accident : అనకాపల్లి జిల్లా కైలాసపట్నం ఘోర ప్రమాదం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో భారీ పేలుడు సంభవించింది. ఈ పేలుడులో ఎనిమిది మంది మృతి చెందారు. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని స్థానికులు అంటున్నారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. హోంమంత్ర అనిత వంగలపూడి, కలెక్టర్, ఎస్పీతో సీఎం ఫోన్ లో మాట్లాడారు. ప్రమాదానికి కారణాలు, బాధితుల ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.

"అనకాపల్లి జిల్లా, కోటవురట్లలో బాణసంచా తయారీ కేంద్రంలో అగ్నిప్రమాదం చోటుచేసుకుని ఆరుగురు కార్మికులు మృతి చెందడం దిగ్భ్రాంతి కలిగించింది. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందన్న సమాచారం ఆందోళన కలిగించింది. ఘటనపై జిల్లా కలెక్టర్, ఎస్పీ, హోంమంత్రి అనితతో ఫోన్‌లో...