ఆంధ్రప్రదేశ్,విశాఖపట్నం, ఏప్రిల్ 2 -- బీర్ బాటిల్‌తో చిన్నారి పీక కోసి హ‌త్య చేసిన నిందితుడికి కోర్టు ఉరిశిక్షను విధించింది. ప‌దేళ్ల నాటి కేసులో అన‌కాప‌ల్లి జిల్లాలోని చోడ‌వరం కోర్టు సంచ‌ల‌నం తీర్పు ఇచ్చింది. అంతేకాకుండా రూ.10 వేల జ‌రిమానా కూడా విధించింది. ఈ తీర్పు స్థానికంగా సంచ‌ల‌నంగా మారింది. ఆ కోర్టు చ‌రిత్ర‌లో తొలి ఉరి శిక్ష తీర్పు ఇదే. నిందితుడికి ఉరి శిక్షే సరైందని బాధిత చిన్నారి తల్లిండ్రులు పేర్కొన్నారు.

అన‌కాప‌ల్లి జిల్లా దేవ‌రాప‌ల్లి మండ‌ల కేంద్రంలోని గొల్ల పేట వీధిలో వేపాడ మురుగ‌న్‌, ధ‌న‌లక్ష్మి దంప‌తులు నివాసం ఉండేవారు. పొట్ట‌కూటి కోసం త‌మిళ‌నాడు నుంచి ప‌దేళ్ల క్రితం ఇక్క‌డికి వ‌చ్చి ఉంటున్నారు. వారు కుటుంబ పోష‌ణ‌కు హోట‌ల్ నిర్వ‌హించేవారు. వారికి ఒక్క‌గా ఒక్క కుమార్తె దివ్య (7) ఉంది. ఆ చిన్నారి స్థానికంగా ఉండే స్కూల్లో యూకేజ...