భారతదేశం, ఫిబ్రవరి 21 -- Anakapalli Crime: అన‌కాప‌ల్లి దారుణ ఘటన వెలుగు చూసింది. వివాహేత‌ర సంబంధం బ‌య‌ట‌ ప‌డుతుందనే అనుమానంతో పొరుగింటి మ‌హిళను హ‌త్య‌ చేసేందుకు ప్రియుడితో కలిసి ప్రయత్నించింది. హ‌త్యకు ప్రయ‌త్నిస్తుండగా నిందితురాలి భర్త డ్యూటీ ముగించుకుని ఇంటికి రావడంతో బాధితురాలు ప్రాణాలతో బయటపడింది.

భ‌ర్త రాక‌ను గమనించిన భార్య‌, ఆమె ప్రియుడు అక్క‌డి నుంచి పరార‌య్యారు. ర‌క్త‌పు మ‌డుగులో ఉన్న బాధిత మ‌హిళ‌ను ఆసుప్ర‌తికి త‌ర‌లించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు న‌మోదు చేసి నిందితులిద్ద‌రినీ అదుపులోకి తీసుకున్నారు.ఈ ఘ‌ట‌న అన‌కాప‌ల్లి జిల్లా మున‌గ‌పాక మండ‌ల కేంద్రంలో చోటు చేసుకుంది.

పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం మునగ‌పాక‌లోని ఎన్‌టీఆర్ కాల‌నీలో అన్నంప‌ల్లి రాజ్‌కుమార్‌, స‌రిత దంప‌తులు ఉంటున్నారు. వీరి పొరుగింట్లో గ‌ణ‌ప‌ర్తిక...