భారతదేశం, మార్చి 20 -- Anakapalli Crime: అన‌కాప‌ల్లి జిల్లాలో ఘోర‌మైన సంఘ‌ట‌న చోటు చేసుకుంది. హిజ్రాతో స‌హ‌జీన‌వం చేసే వ్య‌క్తి, గంజాయికి అల‌వాటు ప‌డి మ‌రో హిజ్రాతో సంబంధాన్ని కొన‌సాగించాడు. ఈ విష‌యం స‌హ‌జీవ‌నం చేసే హిజ్రాకు తెలిసి, అత‌న్ని నిల‌దీసింది. దీంతో ఆమెను హ‌త్య చేసి, శరీర భాగాల‌ను ముక్క‌లుముక్క‌లుగా కోసి బెడ్‌షీట్‌లో మూట‌గ‌ట్టి జాతీయ ర‌హ‌దారి వంతెన కింద‌ప‌డేశాడు. పోలీసులు కేసు న‌మోదు చేసి, నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.

అన‌కాప‌ల్లి జిల్లాలో మూడు రోజుల క్రితం జ‌రిగిన ఈ ఘ‌ట‌న బుధ‌వారం వెలుగులోకి వ‌చ్చింది. పోలీసులు తెలిపిన వివ‌రాల ప్ర‌కారం అన‌కాప‌ల్లిలోని గ‌వ‌ర‌పాలెంలోని ముత్రాసునాయ‌కుల వీధికి చెందిన దిలీప్ కుమార్ నాలుగేళ్ల క్రితం ఆప‌రేష‌న్ చేయించుకుని హిజ్రాగా మారాడు. దిలీప్ కుమార్ దీపిక‌, దీపుగా పేరు మార్చుకున్నాడు.

కాకిన...