భారతదేశం, ఏప్రిల్ 14 -- ఉమ్మడి విశాఖపట్నం జిల్లాలో చాలా ప్రాంతాల్లో బాణాసంచా తయారీ కేంద్రాలు ఉన్నాయి. వీటిల్లో వందలాది మంది పనిచేస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఇక్కడిదాకా బాగానే ఉన్నా.. నిర్వాహకుల నిర్లక్ష్యం, అధికారుల అలసత్వం కారణంగా ప్రమాదాలు జరుగుతున్నాయి. ఆ ప్రమాదాల్లో ఇప్పటివరకు పదుల సంఖ్యలో ప్రాణాలు అగ్గిలో బూడిదయ్యాయి. తాజాగా కోటవురట్ల పరిధిలో జరిగిన ఘటనలో భారీగా ప్రాణనష్టం జరిగింది. బాణాసంచా తయారీ కేంద్రంలో పేలుడు సంభవించి 8 మంది మృతిచెందారు.

అనకాపల్లి జిల్లా సబ్బవరం మండలం ఆరిపాక పంచాయతీ శివారు గ్రామం కొత్తపాలెం సమీపంలో రేకుల షెడ్డులో బాణసంచా తయారీ కేంద్రం అనధికారికంగా నడిచేది. దాంట్లో 2022 సెప్టెంబర్‌లో ప్రమాదం జరిగింది. పేలుడు ధాటికి రేకులు 200 మీటర్ల ఎత్తుకు ఎగిసిపడ్డాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు చనిపోయారు.

సబ్బవరం మండలం గుల...