భారతదేశం, మార్చి 1 -- అన‌కాప‌ల్లి జిల్లా దేవ‌రాప‌ల్లి మండ‌లం రైవాడ‌లో దారుణం జరిగింది. లారీ డ్రైవర్‌ను అతని ప్రియురాలే హత్య చేసింది. ఆదివారం అర్థ‌రాత్రి చోటు చేసుకున్న ఈ ఘ‌ట‌నలో విస్తుపోయే నిజాలు బ‌య‌ట‌ప‌డ్డాయి. ఈ కేసుకు సంబంధించిన వివ‌రాల‌ను శుక్ర‌వారం సీఐ పైడ‌పునాయుడు వెల్ల‌డించారు. దేవ‌రాప‌ల్లి మండ‌లం రైవాడ‌కు చెందిన‌ వి.ర‌మ‌ణ లారీ డ్రైవ‌ర్‌గా ప‌ని చేస్తున్నాడు. ఆయ‌న‌కు భార్య, ఇద్ద‌రు కుమారులు ఉన్నారు.

అయితే ర‌మ‌ణ గ‌త కొన్నేళ్లుగా అదే గ్రామానికి చెందిన ఎం.చెల్ల‌య్య‌మ్మ‌తో వివాహేత‌ర సంబంధం పెట్టుకున్నాడు. ర‌మ‌ణ‌, ఎం.చెల్ల‌య్య‌మ్మ మ‌ధ్య వివాహేత‌ర సంబంధం కొన్ని రోజుల పాటు బాగానే సాగింది. ఈ క్ర‌మంలో ర‌మ‌ణ మ‌ద్యానికి బానిస అయ్యాడు. మ‌ద్యం సేవించి చెల్ల‌య్య‌మ్మ‌తో ఇటీవ‌లి త‌ర‌చూ గొడ‌వ ప‌డేవాడు. వీరిమ‌ధ్య గొడ‌వులు ఎక్కువ అయ్యాయి. స‌రిగా లారీ...