భారతదేశం, ఫిబ్రవరి 8 -- అన‌కాప‌ల్లి జిల్లా బుచ్చెయ్య‌పేట మండ‌లం వ‌డ్డాది జంక్ష‌న్‌లో ఓ ప్రైవేట్ స్కూల్‌ ఉంది. ఆ స్కూల్‌లో తొమ్మిదో త‌ర‌గ‌తి చ‌దువుతున్న విద్యార్థిని సందేహాలు నివృత్తి చేసుకోవాడ‌నికి బుధ‌వారం మ‌ధ్యాహ్నం లెక్క‌ల మాస్టార్ దార‌పు గంగాప్ర‌సాద్ వ‌ద్ద‌కు వెళ్లింది. అప్పుడు పంపించేసి.. కొద్దిసేప‌టి త‌రువాత ర‌మ్మ‌ని చెప్పాడు. సాయంత్రం ఆ విద్యార్థిని లెక్క‌ల మాస్టార్ గంగాప్ర‌సాద్ వ‌ద్ద‌కు వెళ్లింది.

విద్యార్థి వెళ్లిన వెంట‌నే క్లాస్ రూమ్ త‌లుపులు వేసేసి, చేయి ప‌ట్టుకుని అస‌భ్య‌క‌రంగా ప్ర‌వ‌ర్తించాడు. ఆమె వారించినా ఆయ‌న వ‌ద‌ల‌లేదు. ఎలాగోలా బాలిక ఆ కీచ‌క ఉపాధ్యాయుడి నుంచి తప్పించుకుంది. రూమ్ నుంచి ఏడుస్తూ బ‌య‌ట‌కొచ్చిన బాలిక.. స్కూల్ ఆయాకు విష‌యం చెప్పింది. దీంతో స్కూల్ ఆయా విద్యార్థిని త‌ల్లిదండ్రులకు బాలిక ఏడుస్తుంద‌ని స‌మాచారం అంద...