Hyderabad, ఫిబ్రవరి 9 -- Sumanth Anaganaga OTT Streaming: అక్కినేని ఫ్యామిలీ నుంచి వచ్చిన వాళ్లలో హీరో సుమంత్ ఒకరు. 1999లో ప్రేమకథ సినిమాతో హీరోగా అరంగేట్రం చేసిన సుమంత్ ఎన్నో వైవిధ్య సినిమాల్లో నటించి అలరించాడు. ప్రేమకథ తర్వాత యువకుడు, పెళ్లి సంబంధం, రామా చిలకమ్మ, నాగార్జునతో కలిసి స్నేహమంటే ఇదేరా వంటి అనేక సినిమాలతో ఆకట్టుకున్నాడు సుమంత్.

సుమంత్ నటించిన సత్యం, గౌరి, మహానంది, గోదావరి, గోల్కొండ హైస్కూల్, మళ్లీ రావా వంటి హిట్స్ అందుకున్నాడు. ఇక సీతారామం సినిమాతో నటుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. సైమా బెస్ట్ సపోర్టింగ్ యాక్టర్ అవార్డ్‌కు నామినేట్ కూడా అయ్యాడు. ఇక, అహం రీబూట్ అనే సినిమాతో ఓటీటీలోకి ఎంట్రీ ఇచ్చాడు హీరో సుమంత్.

ఇప్పుడు తాజాగా మరో సినిమాతో నేరుగా ఓటీటీలో అలరించేందుకు సుమంత్ రెడీ అయ్యాడు. హీరో సుమంత్ నటించిన లేటెస్ట్ మూవీ...