భారతదేశం, సెప్టెంబర్ 21 -- దేశంలోనే అగ్రగామి పాల ఉత్పత్తుల సంస్థ అమూల్ కీలక నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ సంస్కరణల ప్రయోజనాలను వినియోగదారులకు నేరుగా అందించే ఉద్దేశంతో 700కి పైగా ఉత్పత్తుల ధరలను తగ్గించింది. ఈ కొత్త ధరలు సెప్టెంబర్ 22 నుంచి అమల్లోకి వస్తాయి. ఇందులో నెయ్యి, వెన్న, ఐస్‌క్రీమ్, స్నాక్స్ వంటివి ఉన్నాయి.

అమూల్ మాతృసంస్థ గుజరాత్ కో-ఆపరేటివ్ మిల్క్ మార్కెటింగ్ ఫెడరేషన్ (జీసీఎంఎంఎఫ్) ధరల తగ్గింపుపై ఒక ప్రకటన విడుదల చేసింది. ఈ ధరల సవరణ వెన్న, నెయ్యి, యూహెచ్‌టీ పాలు, ఐస్‌క్రీమ్, చీజ్, పనీర్, చాక్లెట్లు, బేకరీ ఉత్పత్తులు, ఫ్రోజెన్ డెయిరీ, పప్పుల అల్లం, మాల్ట్-బేస్డ్ డ్రింక్ వంటి అనేక రకాల ఉత్పత్తులపై వర్తిస్తుందని పేర్కొంది.

వెన్న: 100 గ్రాముల వెన్న ధర రూ. 62 నుంచి రూ. 58కి తగ్గింది.

నెయ్యి: లీటరు నెయ్యి ధర రూ. 650 నుంచి రూ. 610కి తగ...