భారతదేశం, మార్చి 11 -- Amrutha On Pranay Case Verdict : మిర్యాలగూడ పరువు హత్య ప్రణయ్ కేసులో నల్గొండ కోర్టు సంచలన తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. ఒకరికి ఉరి శిక్ష, ఆరుగురికి జీవిత ఖైదు విధిస్తూ కోర్టు సోమవారం తీర్పు ఇచ్చింది. కోర్టు తీర్పుపై ప్రణయ్ సతీమణి అమృత తాజాగా స్పందించారు. సోషల్ మీడియాలో ఆమె పోస్టు పెట్టారు.

"నా నిరీక్షణకు తెరపడి న్యాయం జరిగింది. నా హృదయం ఉద్వేగంతో నిండిపోయింది. ఈ తీర్పు గౌరవం పేరుతో జరిగే నేరాలు, దౌర్జన్యాలను తగ్గించగలదని ఆశిస్తున్నాను. నా ప్రయాణంలో అచంచలమైన మద్దతునిచ్చిన మొత్తం పోలీసు శాఖ, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్, మీడియా సిబ్బందికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. నా బిడ్డ ఎదుగుతున్నాడు...కాబట్టి నా మానసిక ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని, అతని భవిష్యత్తును కాపాడుకోవడం కోసం నేను మీడియాలో కనిపించడం లేదా ప్రెస్ మీట్‌ల...