అమెరికా,వాషింగ్టన్, జనవరి 30 -- వాషింగ్టన్ నేషనల్ ఎయిర్ పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ల్యాండ్ అవుతుండగా అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్రాంతీయ జెట్. హెలికాప్టర్ ను ఢీకొంది. దీంతో విమానం, హెలికాప్టర్ పోటోమాక్‌ నదిలో కూలిపోయాయి. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు.

అమెరికాలోని వాషింగ్టన్ డీసీలో ప్రయాణీకుల విమానం, ఆర్మీ హెలికాప్టర్ ఢీకొన్నాయి. విమానంలో చాలా మంది ప్రయాణికులు ఉన్నారు. ఈ విమాన ప్రమాదం విమానాశ్రయం సమీపంలో జరిగింది. విమానం అమెరికాలోని కాన్సాస్ సిటీ నుంచి వాషింగ్టన్‌కు వస్తోంది. మరోవైపు యూఎస్ ఆర్మీ హెలికాప్టర్ బ్లాక్‌హాక్(H-60) గాలిలో ఉంది. ఈ సమయంలో ఢీ కొనడంతో ప్రమాదం జరిగింది. ప్రమాదం తర్వాత పొటోమాక్ నదిలో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి.

అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం -5342లో 60 మంది ప్రయాణికులతో పాటు నలు...