అమెరికా,వాషింగ్టన్, జనవరి 30 -- వాషింగ్టన్ నేషనల్ ఎయిర్ పోర్టులో ఘోర ప్రమాదం జరిగింది. బుధవారం రాత్రి ల్యాండ్ అవుతుండగా అమెరికన్ ఎయిర్ లైన్స్ కు చెందిన ప్రాంతీయ జెట్. హెలికాప్టర్ ను ఢీకొంది. దీంతో విమానం, హెలికాప్టర్ పోటోమాక్‌ నదిలో కూలిపోయాయి. ఘటనాస్థలంలో అధికారులు సహాయక చర్యలు చేపట్టారు

కాన్సాస్ లోని విచిటా నుంచి బయలుదేరిన ప్రాంతీయ జెట్ రాత్రి 9 గంటల సమయంలో ఎయిర్ పోర్టు రన్ వే వద్దకు చేరింది. ఈ సమయంలో మిలిటరీ బ్లాక్ హాక్ హెలికాప్టర్ ను ఢీకొట్టిందని ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్ తెలిపింది.

అమెరికన్ ఎయిర్ లైన్స్ విమానం -5342లో 60 మంది ప్రయాణికులతో పాటు నలుగురు సిబ్బంది ఉన్నట్లు సీబీఎస్ న్యూస్ పేర్కొంది. ఈ ప్రమాదం నేపథ్యంలో రోనాల్డ్ రీగన్ విమానాశ్రయంలో టేకాఫ్, ల్యాండింగ్ లను నిలిపివేశారు.

ఈ ప్రమాదంలో ఎంత మంది చనిపోయారనే దానిపై స్పష్ట...