భారతదేశం, మార్చి 15 -- Ambati Rambabu : పిఠాపురం జనసేన ఆవిర్భావ సభలో డిప్యూటీ సీఎం పవన్‌ ఏం మాట్లాడారో ఆయనకే తెలియలేదని వైఎస్సార్‌సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు విమర్శించారు. జనసేన పార్టీకి దిశదశ లేదని.. పవన్‌ రాజకీయాలను ప్రజలు గమనిస్తున్నారన్నారు. తాడేపల్లిలోని వైఎస్సార్‌సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... "చంద్రబాబుకు ఊడిగం చేయడానికే పవన్‌ జనసేన స్థాపించారని, పవన్‌ ప్రజల కోసం పోరాడే వ్యక్తి కాదు.. కుటుంబం కోసమే పోరాటం చేస్తారు" అంటూ అంబటి రాంబాబు తీవ్రంగా విమర్శించారు.

"శాస‌న‌స‌భ‌లోకి ప‌వ‌న్ క‌ల్యాణ్ మొద‌టిసారి ప్రవేశించిన త‌ర్వాత ఈ స‌భ నిర్వహించారు. ప్రజ‌లంతా మీడియా హ‌డావుడి చూసి ఆయ‌న ఏం చెబుతారోన‌ని చాలా ఆస‌క్తిగా ఎదురు చూస్తే, ఆయ‌న ఏం చెప్పద‌లుచుకున్నారో ఆయ‌న‌కైనా అర్థమైందా అనే అనుమానం క‌లిగేలా మాట్లాడారు. 40 ఏళ్...