భారతదేశం, అక్టోబర్ 28 -- ప్రముఖ ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్.. మరోమారు లేఆఫ్స్​కి సిద్ధమవుతోందని సమాచారం. మంగళవారం నుంచే దాదాపు 30,000 కార్పొరేట్ ఉద్యోగులను తొలగించేందుకు రెడీ అవుతోందని ఓ ప్రముఖ అంతర్జాతీయ వార్తా సంస్థ నివేదించింది. ఈ విషయమై తెలిసిన ముగ్గురు వ్యక్తులను ఉటంకిస్తూ రాయిటర్స్ ఈ నివేదికను వెలువరించింది.

కరోనా మహమ్మారి సమయంలో భారీగా విస్తరించిన సంస్థ, ప్రస్తుతం ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నాల్లో భాగంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

ప్రస్తుతం అమెజాన్‌లో సుమారు 3.5 లక్షల మంది కార్పొరేట్ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో దాదాపు 10 శాతం మందిని తొలగించాలని సంస్థ యోచిస్తోంది. కాగా, ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌లో పనిచేస్తున్న మొత్తం 15.5 లక్షల (1.55 మిలియన్) మంది సిబ్బందిలో ఇది ఒక చిన్న భాగం!

ఈ లేఆఫ్స్ గనక ఖరారైతే, 2022 సంవత్సరం చివరిలో...