భారతదేశం, మార్చి 18 -- Amazon Layoffs: ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ 2025 లో కంపెనీ ఖర్చులను ఆదా చేేసే లక్ష్యంతో 14,000 మంది మేనేజ్మెంట్ ఉద్యోగాలను తొలగించనుందని,పలు మీడియా సంస్థలు నివేదించాయి. ఇది దాదాపు 13 శాతం ఉద్యోగుల తగ్గింపుకు సమానం. ఈ లే ఆఫ్ ల తర్వాత ఏటా 2.1 బిలియన్ డాలర్ల నుంచి 3.6 బిలియన్ డాలర్ల వరకు ఆదా చేయాలని కంపెనీ భావిస్తోంది. ఈ మేనేజీరియల్ ఉద్యోగాల కోతతో సంస్థలో మేనేజర్ల సంఖ్య 91,936కు తగ్గుతుంది. ప్రస్తుతం సంస్థలో 1,05,770 మంది మేనేజర్లు ఉన్నారు.

కంప్లీట్ సర్కిల్ మేనేజింగ్ పార్ట్నర్, చీఫ్ ఇన్వెస్ట్మెంట్ ఆఫీసర్ (సీఐఓ) గుర్మీత్ చద్దా సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ఎక్స్ లో పెట్టిన పోస్ట్ లో అమెజాన్ లో ఉద్యోగాల కోతల గురించి వివరించారు. అమెజాన్ గత నవంబర్ లో 18 వేల మందిని తొలగించిన తర్వాత ఇప్పుడు మరో 14,000 మందిని తొలగిస్తోంది. వారు తమ హ...