భారతదేశం, జనవరి 28 -- Amazon Employees: పనిచేస్తున్న సంస్థకు ఉద్యోగులు టోకరా వేయడంతో ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్‌కు భారీ నష్టం వాటిల్లింది. అందులో పనిచేసే ఉద్యోగులే హైదరాబాద్‌ కేంద్రంగా భారీ మోసానికి పాల్పడ్డారు. నకిలీ ట్రిప్పులతో డెలివరీ చేసే వారికి చెల్లించే కమిషన్‌ పేరిట భారీగా సొమ్ము చేసుకున్నారు. హైదరాబాద్ కేంద్రంగాఈ మోసం జరగడంతో పోలీస్ కేసు నమోదు అయ్యింది. అమెజాన్‌ కాల్‌ సెంటర్‌లో పనిచేసే ఉద్యో గులు, గతంలో పనిచేసి మానేసిన వారు.. అమెరికాలో సరకులు సరఫరా చేసే వారితో కలిసి ఈ కుట్రకు పాల్పడినట్టు అమెజాన్ సంస్థ ఫిర్యాదు చేసింది. ఈ మోసంతో అమెజాన్‌‌కు దాదాపు రూ.102 కోట్ల నష్టం వాటిల్లినట్టు సైబర్ సెక్యూ రిటీ బ్యూరోకు ఫిర్యాదు చేయడంతో దర్యాప్తు మొదలుపెట్టారు.

ప్రపంచవ్యాప్తంగా అమెజాన్‌ సంస్థ ఈ కామర్స్‌ వ్యాపారాన్ని నిర్వహిస్తోంది. ప్రపంచ వ్యాప...