భారతదేశం, ఏప్రిల్ 14 -- Amarnath Yatra : హిందూ భ‌క్తులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అమ‌ర్‌నాథ్ యాత్ర స్లాట్ బుకింగ్ ప్రారంభం అయింది. అయితే రాష్ట్రంలో మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ల జారీలో జాప్యం జ‌రుగుతుంది. ఆసుప‌త్రుల చుట్టూ భ‌క్తులు కాళ్లరిగేలా తిరుగుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమ‌తి రాలేదని, అనుమ‌తి వ‌చ్చిన వెంట‌నే ప్రక్రియ ప్రారంభిస్తామ‌ని ప్రభుత్వ ఆసుప‌త్రుల నుంచి వ‌స్తోన్న స‌మాధానం.

అమ‌ర్‌నాథ్ యాత్రకు వెళ్లాలంటే, స్లాట్ బుకింగ్ చేసుకున్నప్పుడే మెడిక‌ల్ స‌ర్టిఫికేట్ త‌ప్పనిస‌రిగా అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. మెడిక‌ల్ స‌ర్టిఫికేట్ లేక‌పోతే స్లాట్ బుకింగ్ అవ్వదు. అమ‌ర్‌నాథ్ యాత్రకు వెళ్లే భ‌క్తుల‌కు ప్రభుత్వ జ‌న‌ర‌ల్ ఆసుప‌త్రుల్లో మెడిక‌ల్ టెస్టులు చేయాల్సి ఉంటుంది. ఆ త‌రువాత మెడిక‌ల్ స‌ర్టిఫికేట్ జారీ చేస్తారు. అయితే అమ‌ర్‌నాథ్ యాత్ర స్...