భారతదేశం, ఏప్రిల్ 15 -- Amarnath Tour Medical Certificate : హిందూ భ‌క్తులు ఎప్పుడా అని ఎదురు చూస్తున్న అమ‌ర్‌నాథ్ యాత్రకు మెడిక‌ల్ స‌ర్టిఫికెట్ జారీ రేప‌టి (బుధవారం) నుంచి ప్రారంభం కానుంది. యాత్రికుల‌కు మెడిక‌ల్ టెస్టులు నిర్వహించి, స‌ర్టిఫికెట్ల జారీ చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం అనుమ‌తి ఇచ్చింది. దీంతో గుంటూరు ప్రభుత్వ ఆసుప‌త్రి మెడిక‌ల్ స‌ర్టిఫికెట్లు ఇచ్చేందుకు టెస్టులు నిర్వహించ‌నుంది.

ఒక‌పక్క అమ‌ర్‌నాథ్ యాత్రకు స్లాట్ బుకింగ్ ప్రారంభ‌మైన‌ప్పటికీ, రాష్ట్రంలో మెడిక‌ల్ స‌ర్టిఫికెట్లు జారీలో జాప్యం జ‌రుగుతుంద‌ని భ‌క్తులు అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆసుప‌త్రుల చుట్టూ భ‌క్తులు కాళ్లరిగేలా తిరిగారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమ‌తి రాలేదని, అనుమ‌తి వ‌చ్చిన వెంట‌నే ప్రక్రియ ప్రారంభిస్తామ‌ని గుంటూరు ప్రభుత్వ ఆసుప‌త్రి పేర్కొంటున్నాయి. దీని...