భారతదేశం, ఫిబ్రవరి 6 -- రాజధాని అమరావతి పునర్నిర్మాణ పనుల ప్రారంభానికి ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్ అడ్డంకిగా మారింది. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ రుణంతో చేపట్టబోయే పనులకు సీఆర్‌డీఏ, ఏడీసీఎల్ గత నెలలో పెద్ద ఎత్తున బిడ్లు ఆహ్వానించాయి. వీటిలో చాలా పనులకు గడువు ముగిసింది. మరికొన్నింటిని 7వ తేదీన తెరవాల్సి ఉంది. బిడ్లను తెరిచి ఖరారు చేసే దశలో ఎమ్మెల్సీ ఎన్నికలకు సంబంధించి.. ఎన్నికల సంఘం షెడ్యూల్ ప్రకటించింది. దీంతో టెండర్ల ఖరారు, కొత్తవి పిలిచే ప్రక్రియకు బ్రేక్ పడింది.

రాజధాని అమరావతిలో వివిధ జోన్లు ఉన్నాయి. ఈ జోన్లలోని లేఅవుట్లలో రోడ్లు, తాగునీటి సరఫరా, డ్రైన్లు, ఇంటర్నెట్ తీగలు వేసేందుకు డక్ట్‌ల నిర్మాణం, అవెన్యూ ప్లాంటేషన్ వంటి అభివృద్ధి పనులు చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇవే కాకుండా.. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, అఖిల భారత సర్వీసు అధికారుల నివాస భ...