భారతదేశం, ఏప్రిల్ 15 -- Amaravati works: అమరావతిలో రూ.64వేల కోట్లతో రాజధాని నిర్మాణ పనులు ప్రారంభించినట్టు మంత్రి నారాయణ వివరించారు. రాజధానిలోని అనంతవరంలో మంగళవారం మంత్రి నారాయణ పర్యటించారు. అమరావతి నిర్మాణ పనులకు అవసరమైన గ్రావెల్ కోసం కొండలను మంత్రి నారాయణ,సీఆర్డీయే,మైనింగ్ శాఖల అధికారులు పరిశీలించారు.

గత ప్రభుత్వ నిర్వాకంతో అమరావతిలో రాజధాని పనుల ప్రారంభానికి ఆటంకాలు వచ్చాయని, న్యాయపరమైన సమస్యలు అధిగమించేందుకు 8 నెలలు పట్టిందని మంత్రి వివరించారు. 68 పనులకు సంబంధించి 42360 కోట్ల విలువైన పనులకు టెండర్లు పూర్తయ్యాయని, ఈ పనులన్నీ ఇప్పటికే ప్రారంభం అయ్యాయని మంత్రి చెప్పారు.

అమరావతి పనులకు అవసరమైన గ్రావెల్ కోసం గనుల శాఖ 851 ఎకరాలు సీఆర్డీయే కు కేటాయించిందని, గతంలో అనంతవరం కొండను సీఆర్డీయే కు కేటాయించారని గత ప్రభుత్వంలో 8 మీటర్ల లోతు వరకూ తవ...