ఆంధ్రప్రదేశ్,అమరావతి, మార్చి 13 -- అమరావతిలోని శ్రీవారి ఆలయంలో మార్చి 15న శ్రీనివాస కళ్యాణం జరగనుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లపై టీటీడీ ఈవో శ్యామలరావు సమీక్షించారు. వెంకటపాలెం శ్రీవారి ఆలయ ప్రాంగణంలో జరుగనున్న శ్రీనివాస కల్యాణానికి సంబంధించిన అన్ని పనులను సకాలంలో పూర్తి చేయాలని ఆదేశించారు.

శ్రీ‌నివాస క‌ల్యాణంపై వెంక‌ట‌పాలెం సమీపంలోని గ్రామాల్లో టీటీడీ ప్రచారం రథం ద్వారా పెద్ద ఎత్తున ప్ర‌చారం నిర్వ‌హించాలన్నారు. భ‌క్తుల‌కు ఇబ్బంది త‌లెత్త‌కుండా క‌ల్యాణ‌ వేదిక పరిసరాలలో అవసరమైన గ్యాలరీలు, క్యూ లైన్లు ఏర్పాటు చేయాల‌ని ఆదేశించారు. శ్రీ‌వారి ఆల‌యం, క‌ల్యాణ వేదిక ప‌రిస‌రాల్లో భ‌క్తుల‌ను ఆక‌ట్టుకునేలా విద్యుత్ అలంక‌ర‌ణలు చేప‌ట్టాలన్నారు.

శ్రీవారి ఆలయానికి విచ్చేసి భక్తులు సులభతరంగా స్వామివారిని దర్శించుకునేలా చర్యలు చేపట్టాలని ఈవో సూచించారు....