భారతదేశం, ఏప్రిల్ 14 -- Amaravati Real Estate : ఏపీ రాజధాని అమరావతికి పూర్వవైభవం తీసుకొచ్చేందుకు కూటమి ప్రభుత్వం సర్వవిధాలా ప్రయత్నాలు చేస్తుంది. అమరావతికి కేంద్రం నుంచి నిధులు సాధించడంతో పాటు కొత్త ప్రాజెక్టులు సాధించేందుకు కృషి చేస్తుంది. రాజధాని అమరావతి పనులు వేగం పుంజుకోవడంతో విజయవాడ-గుంటూరు ప్రాంతంలో రియల్ ఎస్టేట్ కార్యకలాపాలు ఊపందుకున్నాయి.

వైసీపీ హయాంలో మూడు రాజధానుల ప్రణాళికతో అమరావతి పనులు ముందుకుసాగలేదు. అమరావతి ప్రాజెక్టులలో పెట్టుబడులు నిలిచిపోవడంతో రియల్ ఎస్టేట్ డెవలపర్లు వెనకడుగు వేశారు. అయితే ఏపీలో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడడం, కేంద్రంలో సీఎం చంద్రబాబు కీలకంగా మారడంతో అమరావతిలో మళ్లీ రియల్ బూమ్ స్టార్ట్ అయ్యింది. భూమి విలువ, రియల్ ఎస్టేట్ ప్రాజెక్టులకు డిమాండ్ పెరుగుతుందని డెవలపర్లు ఆశిస్తున్నారు.

"2014, 2019 మధ్య సీఎం చంద్రబ...